: చేపలతో బ్రెస్ట్ క్యాన్సర్‌కు చెక్
చేపలను తీసుకోవడం ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ సమస్యను తగ్గించవచ్చని తాజా అధ్యయనం చెబుతోంది. చేపల్లో ఉండే ఫ్యాటీ ఆసిడ్లు బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయని ఈ అధ్యయనంలో తేలింది. నూనె శాతం అధికంగా కలిగిన సాల్మన్, టునా లేదా సార్డియన్స్ వంటి చేపలను కొద్దిమొత్తంలో తీసుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మొత్తం క్యాన్సర్ రోగుల్లో సుమారు 23 శాతం రోగులు బ్రెస్ట్ క్యాన్సర్‌కు సంబంధించిన వారే. అలాగే 2008లో క్యాన్సర్ వ్యాధి మూలంగా మరణించిన వారిలో 14 శాతం మంది బ్రెస్ట్ క్యాన్సర్ రోగులే. సరైన ఆహారం తీసుకోవడం, సరైన జీవన విధానం అలవడిన వారిలో బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు చాలా తక్కువగా ఉంటుందని, అలాగే మన ఆహార అలవాట్లు, అందులోని కొవ్వులు, ఇతరాలు క్యాన్సర్ వ్యాధికి కారణమవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చేపల్లోని ఫాటీ ఆసిడ్లు మెదడుపై పనిచేసి మన శరీరంలోని రక్తనాళాల పనితీరును సక్రమంగా ఉండేలా చేస్తాయని, అలాగే నిరోధక శక్తిని కూడా పెంచుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.