: చిన్న సినిమా, పెద్ద సినిమా కాదు, మంచి సినిమా: అల్లు అర్జున్
'సినిమా అంటే చిన్నసినిమా, పెద్ద సినిమా కాదు, కేవలం మంచి సినిమా మాత్రమే' అని ప్రముఖ హీరో అల్లు అర్జున్ అన్నారు. 'రొమాన్స్' సినిమా ఆడియో రిలీజ్ సందర్భంగా స్టైలిష్ స్టార్ మాట్లాడుతూ, మారుతి సినిమాలను తానెంజాయ్ చేసినంత బాగా ఎవరూ ఎంజాయ్ చేయరని అన్నారు. 'సినిమాను డిజిటల్ చేయడంలో మారుతి నాకు ఎగ్జాంపుల్ గా నిలిచా'డన్న బన్నీ, ఇండస్ట్రీలో చాలామందికి జీవితాన్నిచ్చినందుకు అభినందించారు. డాన్సు చేయాలన్న అభిమానుల కోరికను అర్జున్ సున్నితంగా తిరస్కరించారు.