: కేటీఆర్ కావూరిని కలవడం మ్యాచ్ ఫిక్సింగే: ఎర్రబెల్లి
తెలంగాణ ద్రోహిగా ముద్ర వేసిన కావూరి సాంబశివరావును టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కలవడం మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగమేనని టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు ఆరోపించారు. హైదరాబాద్ లోని టీడీపీ భవన్ లో మాట్లాడిన ఆయన, కేటీఆర్, అతని వర్గం బయటకి ఓ మాట మాట్లాడుతూ .. లోపల తెలంగాణకి ద్రోహం చేసే పనులు చేస్తారని విమర్శించారు. కేసీఆర్, అతని కుటుంబసభ్యుల ఆస్తులపై విచారణ జరిపించాలని గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. హైదరాబాద్ తో కూడిన తెలంగాణ ఏర్పాటుకు టీడీపీ కట్టుబడి ఉందని, ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.