: ఐజీలుగా పదోన్నతి పొందిన ఐదుగురు ఐపీఎస్ లు


1995 కి చెందిన ఐదుగురు ఐపీఎస్ అధికారులకు ఐజీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రవీణ్ కుమార్, అతుల్ సింగ్, ఆర్ కే మీనా, ఎం ఎం భగవత్, స్వాతీ లక్రా ఐజీలుగా పదోన్నతి పొందిన వారిలో ఉన్నారు. వీరితో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ గా ఆర్పీ ఠాకూర్ ను నియమించింది. ముగ్గురు అడిషనల్ ఎస్పీలకు నాన్ కేడర్ ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ జెన్ కో ఎస్పీగా దేవదానం, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్పీగా జగ్గారెడ్డి, సీఐడీ ఎస్పీగా ప్రేమ్ బాబును నియమించింది.

  • Loading...

More Telugu News