: ఎయిర్ ఫోర్స్ అధికారి అంత్యక్రియలకు రాహుల్ గాంధీ హాజరు


ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఉత్తరాఖండ్ వరద సహాయక చర్యల్లో హెలికాప్టర్ కూలి మరణించిన భారత వాయుసేన అధికారి అఖిలేశ్ కుమార్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అఖిలేశ్ అంత్యక్రియలు నేడు ఉత్తరప్రదేశ్ లోని ఆయన స్వగ్రామం పురేనాగోలో జరిగాయి. తొలుత పుర్ సాత్ గంజ్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ అక్కణ్ణించి రోడ్డు మార్గం ద్వారా పురేనాగో గ్రామం చేరుకున్నారు. అక్కడ అఖిలేశ్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎలాంటి సాయమైనా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన వారికి భరోసా ఇచ్చారు. ఉత్తరాఖండ్ వరద బాధితులను కాపాడే క్రమంలో గౌరీకుండ్ వద్ద హెలికాప్డర్ కుప్పకూలగా 20 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ మృతుల్లో అఖిలేశ్ కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News