: నేను ఫిక్సర్ నే: ఒప్పుకున్న పాక్ క్రికెటర్


పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ తాను ఫిక్సింగ్ కు పాల్పడ్డట్టు తొలిసారి మీడియా ఎదుట అంగీకరించాడు. రెండేళ్ళ క్రితం ఇంగ్లండ్ లో సంచలనం సృష్టించిన స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో భట్ తో పేసర్లు మహ్మద్ ఆసిఫ్, మహ్మద్ అమీర్ లు దోషులుగా తేలిన సంగతి తెలిసిందే. వారికి లండన్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించగా.. ఇటీవలే వారు విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో భట్ నేడు లాహోర్లో మీడియాతో మాట్లాడుతూ, ఫిక్సింగ్ ఉదంతం కారణంగా బాధపడిన అభిమానులకు, దేశానికి క్షమాపణలు తెలిపాడు.

కాగా, భట్ పై ఐసీసీ 10 ఏళ్ళ నిషేధం విధించింది. ఇక ఆసిఫ్ 7 సంవత్సరాలు, అమీర్ 5 ఏళ్ళు నిషేధం ఎదుర్కొంటున్నారు. ఐసీసీ విధించిన నిషేధంపై భట్, ఆసిఫ్ లు స్విట్జర్లాండ్ లోని అంతర్జాతీయ క్రీడల ఆర్బిట్రేషన్లో పిటిషన్ దాఖలు చేసినా ఫలితం ప్రతికూలంగానే వచ్చింది. అమీర్ మాత్రం తనపై విధించిన నిషేధాన్ని సవాలు చేయకూడదని నిర్ణయించుకున్నాడు.

  • Loading...

More Telugu News