: ఎన్టీఆర్ ఫొటో పెడితే చెప్పుతో కొట్టండి: రేవంత్ రెడ్డి
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నేడు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఫ్లెక్సీల్లో, బ్యానర్లలో ఎన్టీఆర్ ఫొటోలు పెట్టే వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను చెప్పుతో కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడలో నేడు మీడియాతో మాట్లాడుతూ.. పిల్ల కాంగ్రెస్ నేతలు ఎన్టీఆర్ ఫొటో పెట్టుకుని ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని, వారికి సరైన రీతిలో బుద్ధి చెప్పాలని కార్యకర్తలకు సూచించారు. ఇక రాబోయే ఎన్నికల గురించి వ్యాఖ్యానిస్తూ.. 1994 ఫలితాలు పునరావృతం అవుతాయని జోస్యం చెప్పారు.