: కీచక టీచర్ కు పదేళ్లు జైలు


కీచక టీచర్ పాపం పండింది. తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం జిల్లా పరిషత్ పాఠశాలలో ఆరోతరగతి బాలికను వంచించి మోసం చేసిన కంప్యూటర్ ఉపాధ్యాయుడు చోడి దుర్గాప్రసాద్ కు పదేళ్ల జైలు శిక్ష, 500 రూపాయల జరిమానా విధిస్తూ రామచంద్రాపురం అసిస్టెంట్ సెషన్స్ జడ్జి శిక్ష విధించారు. ద్రాక్షారామం జిల్లాపరిషత్ పాఠశాలలో కంప్యూటర్ ఉపాధ్యాయుడిగా పని చేసిన దుర్గా ప్రసాద్ అదే స్కూల్ లో ఆరోతరగతి చదువుతున్న బాలికకు మాయమాటలు చెప్పి ప్రతిరోజూ మద్యాహ్నం సమీపంలోని ఆసుపత్రివద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు. దీనిపై 2010 అక్టొబర్ లో కేసు నమోదైంది. బాధితురాలి తరపున పీపీ జయలక్ష్మి వాదించగా, నేరం రుజువవడంతో శిక్షవిధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.

  • Loading...

More Telugu News