: అభ్యర్ధుల ఎన్నికల వ్యయాన్ని పెంచిన కమిషన్
స్థానిక సంస్థల ఎన్నికల వ్యయాన్ని 60 శాతం పెంచుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. జడ్పీటీసీ అభ్యర్ధి ఎన్నికల వ్యయాన్ని లక్ష రూపాయల నుంచి లక్షా ఇరవై వేలకు పెంచారు. ఎంపీటీసీ అభ్యర్ధి ఎన్నికల వ్యయాన్ని 50 వేల నుంచి 80 వేలకు పెంచారు. 10 వేల జనాభా కంటే తక్కువ ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్ధి వ్యయం 20 వేల నుంచి 30 వేలకు పెంచారు. పదివేల జనాభా కంటే ఎక్కువ ఉంటే 40 వేల నుంచి 64 వేలకు పెంచారు. వార్డు మెంబర్ల విషయంలో కూడా పదివేల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో 5 వేల నుంచి 8 వేలకు, పది వేల కంటే తక్కువుంటే 3 వేల నుంచి 4 వేలకు పెంచారు.