: సిరిసిల్లలో టెక్స్ టైల్ పార్కు.. కావూరికి కేటీఆర్ వినతి


కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో 210 కోట్ల రూపాయలతో టెక్స్ టైల్స్ పార్కును ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావును ఎమ్మెల్యే కె తారకరామారావు కోరారు. మరమగ్గాల కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, రుణమాఫీ పథకం అమలు చేసి, పావలా వడ్డీకే రుణాలందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు హైదరాబాద్ లో కావూరిని కలిసి కేటీఆర్ ఒక వినతిపత్రం అందించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణపై మంత్రి వ్యాఖ్యలు స్వాగతిస్తున్నట్లు చెప్పారు. కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News