: సంజయ్ దత్ కు భద్రత కట్టుదిట్టం
పుణెలోని ఎరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు భద్రతను కట్టుదిట్టం చేశారు. సిబ్బంది సంఖ్యను పెంచారు. ముంబైలోని జైలులో మాఫియా లీడర్ అబూసలేంపై తోటి ఖైదీ కాల్పులు జరపడంతో.. పుణెలోని ఎరవాడ జైలు అధికారులు అప్రమత్తమయ్యారు. సంజయ్ దత్ పై దాడికి అవకాశాలున్నాయని జైలు అధికారులకు గతంలో ఇంటెలిజెన్స్ నుంచి హెచ్చరికలు కూడా అందాయి. తాజా ఘటనతో అధికారులు భద్రతను పటిష్టం చేశారు.