: కేదార్ నాథ్ ను పునర్నిర్మిస్తాం: బహుగుణ


గంగా, అలకనంద నదులు ఉప్పొంగడంతో రూపు లేకుండా పోయిన కేదార్ నాథ్ పట్టణాన్ని సరికొత్తగా నిర్మిస్తామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయబహుగుణ చెప్పారు. నిపుణుల సలహాలతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నివాసాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఆలయం సమీపంలో నిర్మాణాలపై నిషేధం విధించాలనుకుంటున్నామని చెప్పారు. అలాగే, ఇటీవల వరదల్లో ఎంతో మంది గల్లంతు కావడం, వారి ఆచూకీ కూడా లభించకపోవడంతో.. ఇకపై కేదార్ నాథ్, యమునోత్రికి వచ్చే యాత్రికులు ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవడాన్ని తప్పనిసరిగా అమలు చేస్తామన్నారు. బద్రీనాథ్, గంగోత్రి యాత్రికులకు దీనిని అమలు చేసే యోచన ఇప్పటికైతే లేదని తెలిపారు.

  • Loading...

More Telugu News