: గేల్ కు మెసేజ్ పంపించా: బ్రేవో
బోనస్ పాయింటుతో గెలిచేందుకు ప్రయత్నించమని క్రిస్ గేల్ కు ఆట మధ్యలోనే చెప్పానని వెస్టిండీస్ కెప్టెన్ డ్వేన్ బ్రేవో తెలిపాడు. ముక్కోణపు సిరీస్ లో నిన్న జరిగిన తొలి మ్యాచులో క్రిస్ గేల్ సెంచరీ సాధించడంతో శ్రీలంకపై విండీస్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. 'క్రిస్ ఆడుతున్న తీరు చూస్తే గెలిచేస్తామని నాకు అర్థమైపోయింది. అయితే క్రిస్ అలాగే క్రీజులో ఉంటే బోనస్ పాయింటు కూడా వచ్చే అవకాశముంది. అందుకే బోనస్ పాయింటు విజయానికి ప్రయత్నించమని 29వ ఓవర్లలో క్రిస్ కు మెసేజ్ పంపించాను' అని వివరించాడు బ్రేవో