: ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలలో సీఎం పర్యటన


అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచాయి. కోలుకోలేని దెబ్బతీశాయి. లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. ఈ దారుణ పరిస్థితులను అంచనా వేయడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ఈ రోజు ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలలోని పలు ప్త్ల్రాంతాలలో పర్యటిస్తున్నారు. నష్టపోయిన పంట పొలాలను అధికారులతో కలిసి  పరిశీలిస్తారు. రైతులతో మాట్లాడతారు. వడగళ్ల వానలకు ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. దెబ్బతిన్నఇళ్లను పరిశీలిస్తారు.

ముఖ్యమంత్రి ముందుగా ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో పర్యటిస్తారు. తర్వాత కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, మేడిపల్లి మండలాలలో దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలిస్తారు. ఇందుకో్సం ఈ ఉదయం ముఖ్యమంత్రి ప్రత్యేక హెలికాప్టర్లో కాగజ్ నగర్ కు బయల్దేరి వెళ్లారు.  

  • Loading...

More Telugu News