: క్రిస్ గేల్ వీరంగం... వెస్టిండీస్ విజయం
ఓపెనర్ క్రిస్ గేల్ సెంచరీ సాధించడంతో వెస్టిండీస్ జట్టు విజయభేరి మోగించింది. ముక్కోణపు క్రికెట్ టోర్నీలో శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్ లో ఇంకా 73 బంతులుండగానే 6 వికెట్ల తేడాతో విండీస్ విజయం సాధించింది. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టులో క్రిస్ గేల్ 100 బంతుల్లో 9 ఫోర్లు 7 సిక్సర్లతో 109 పరుగులు చేశాడు. చార్లెస్ 29, బ్రావో 27,శ్యామ్యూల్ 15 పరుగులు చేశాడు. కులశేఖర, హెరాత్ కు చెరో వికెట్ లభించింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో, బ్యాటింగ్ కు దిగిన శ్రీలంకను స్పిన్నర్ నరైన్ దెబ్బ తీశాడు. నరైన్ 4 వికెట్లతో టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చాడు. దాంతో శ్రీలంక జట్టు 48.3 ఓవర్లలోనే 208 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక జట్టులో జయవర్ధనే 52, మాథ్యూస్ 55, తరంగ 25 పరుగులు చేశారు.