: కొన్ని జంతువులైనా రక్షించబడ్డాయ్‌


హమ్మయ్య కొన్ని జంతువులు రక్షించబడ్డాయి... మన సౌందర్య సాధనాలను మార్కెట్లోకి తెచ్చే ముందుగా జంతువులపై ప్రయోగించి పరీక్షిస్తారు. అయితే ఇకపై ఇలా చేయరాదంటూ ఉద్యమాన్ని తీసుకువచ్చారు పెటా సభ్యులు. దీంతో ఇకనుండి జంతువులపై కాస్మెటిక్‌ ఉత్పత్తులను ప్రయోగించేది లేదంటూ డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా వారు నిర్ణయం తీసుకున్నారు.

మనం ఉపయోగించే పలు రకాలైన సౌందర్య సాధనాలు, క్రీములు, అందులో ఉపయోగించే ఇతర పదార్ధాలను ముందుగా జంతువులపై ప్రయోగించి పరీక్షిస్తారు. అయితే ఇలా చేయడం నిషేధించాలంటూ పీపుల్‌ ఫర్‌ ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ యానిమల్స్‌ (పెటా) పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహించింది. దీంతో డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా డాక్టర్‌ జి.ఎన్‌.సింగ్‌ ఇకపై దేశంలో జంతువులపై ఇలాంటి ప్రయోగాలను అనుమతించేది లేదని ప్రకటించారు. బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ పీసీడీ 19 కాస్మెటిక్స్‌ సెక్షనల్‌ కమిటీ సమావేశంలో ఆయన ఈ మేరకు ప్రకటించారు. ఈ నిర్ణయంపై పెటా సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పెటా ఉద్యమ ఫలితంగా కొన్ని జంతువులైనా పరీక్షల నుండి కాపాడబడ్డాయి.

  • Loading...

More Telugu News