: దక్షిణాసియా వారికే ఎక్కువ షుగరు


షుగరు వ్యాధి పేరుకే తీయగా ఉంటుంది. ఇది వచ్చిన తర్వాత ఇక సదరు రోగి జీవితం చేదుమయం. అయితే ఇలాంటి షుగరు వ్యాధి యూరోపియన్‌ తెల్లవారికన్నా దక్షిణాసియా దేశానికి చెందిన వారిలోనే ఎక్కువగా వస్తుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

గ్లాస్గో యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడయింది. దక్షిణాసియా వాసుల రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండడంతోబాటు ఇన్సులిన్‌ నిరోధకత తక్కువగా ఉండడమే దీనికి కారణమని వారు చెబుతున్నారు. అందుకే దక్షిణాసియా వాసులు షుగరు వ్యాధి వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి ఎక్కువగా వ్యాయామం చేయాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. తెల్లవారికన్నా దక్షిణాసియా వాసుల్లో ఫిట్‌నెస్‌ స్థాయి తక్కువగా ఉండడం వల్లే ఇలా షుగరు వ్యాధికి కారణమవుతోందని, అందువల్ల తెల్లవారికన్నా దక్షిణాసియా వాసులు ఎక్కువగా వ్యాయామం చేయాల్సి ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News