: సూపర్‌ మ్యాన్‌ కాదు... విమానం!


సూపర్‌ మ్యాన్‌ గురించి కార్టూన్‌ ప్రపంచంలో తెలియని వారుండరు. అయితే అదే తరహాలో విమానం ఉంటే... అచ్చు అలాంటి విమానాన్నే ఒకరు సృష్టించారు. సూపర్‌మ్యాన్‌ ఆకారంతో కనిపించే ఈ విమానం ఎంచక్కా గాలిలో ఎగురుతుంది.

చెయ్యెత్తు మనిషి ఆకారంలో కనిపించే ఈ సూపర్‌ మ్యాన్‌ విమానాన్ని శాన్‌ఫ్రాన్సిస్కోలోని శాండియాగోకు చెందిన ఓటో డైటన్‌బాక్‌ అనే వ్యక్తి రూపొందించాడు. శాన్‌ఫ్రాన్సిస్కో సముద్ర తీరం నుండి గాలిలోకి ఎగిరిన ఈ సూపర్‌ విమానం చక్కగా ఆకాశంలో చక్కర్లు కొట్టి కిందికి దిగింది. చూసేందుకు ముఖ్యంగా పిల్లలకు చాలా ఆకర్షణీయంగా కనిపించే ఈ విమానాన్ని త్వరలోనే మార్కెట్లోకి తెస్తానంటున్నాడు డైటన్‌బాక్‌.

  • Loading...

More Telugu News