: బాలీవుడ్ తారలను వెనక్కు 'నెట్టే'సిన శృంగారతార
బాలీవుడ్ లో స్థిరపడడానికి ప్రయత్నిస్తున్న విదేశీ నీలి చిత్రాల సుందరి సన్నీ లియోన్ పాప్యులారిటీ అంతకంతకు పెరిగిపోతోంది. తన ఒంపుసొంపుల అందాలతో కుర్రాళ్ళకు నిద్ర పట్టకుండా చేస్తున్న సన్నీ వివరాల కోసం ఇంటర్నెట్లో తెగ వెతికేస్తున్నారట. ఈ విషయంలో ఈ శృంగారతార తాజాగా ఓ రికార్డు కూడా కొట్టేసింది. ప్రపంచం మొత్తం మీద నెటిజన్లు ఎక్కువగా వెతుకుతున్న బాలీవుడ్ ప్రముఖురాలిగా సన్నీ వార్తలలోకి ఎక్కింది.
గత డిసెంబర్ నెలలో ఏకంగా 3 కోట్ల 50 లక్షల మంది ఆమె కోసం ఇంటర్నెట్లో వెతికారట. నిజంగానే ఇది పెద్ద రికార్డు. ఆమె తర్వాతి స్థానంలో కత్రినా కైఫ్ వుంది. ఆమె కోసం కోటీ 60 లక్షల మంది మాత్రమే సెర్చ్ చేశారట. ఒకప్పటి అందాలతార ఐశ్వర్యారాయ్ కోసం కోటీ 10 లక్షల మంది వెతికారు. దీనిని బట్టి మన తారలను సన్నీ వెనక్కు 'నెట్టే'సిందన్న విషయం తెలుస్తోంది కదూ?