: కాశ్మీర్ లో మరోసారి సీఆర్ పీఎఫ్ పై ఉగ్రవాదుల దాడి
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో మొన్న జరిగిన కాల్పుల ఘటన మర్చిపోకముందే మరోసారి ఉగ్రవాదులు పంజావిసిరారు. అయితే ఈ దాడిలో ఎవరూ గాయపడలేదు. బారాముల్లా జిల్లా సోపోర్ పట్టణంలోని సీఆర్ పీఎఫ్ పికెట్ పై గ్రెనేడ్ తో దాడి చేశారు. అయితే, అది గురితప్పి రోడ్డుపై పడి పేలి పోవడంతో ఎవరూ గాయపడలేదు. కాగా, బస్టాండ్ పరిసర ప్రాంతం కావడంతో ప్రజలు ఆందోళనకు గురై పరుగులు తీశారని పోలీస్ అధికారులు తెలిపారు. ఇండియన్ ముజాహిదీన్ ముసుగులో లష్కరే తోయిబా దాడులు జరుపుతోందని అధికారులు చెబుతున్నారు.