: అబూ సలీం మాజీ ప్రియురాలి స్పందన


ముంబై తలోజా జైలులో తోటి ఖైదీ దాడిలో గాయపడ్డ గ్యాంగ్ స్టర్ అబూసలీం మాజీ ప్రియురాలు సినీతార మోనికాబేడీ స్పందించింది. గతంలో శ్రీకాంత్ సరసన 'తాజ్ మహల్' సినిమాలో హీరోయిన్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్న మోనికా బేడీ... అబూసలీంతో సహజీవనం చేసిన సంగతి తెలిసిందే. పాస్ పోర్టు కేసులో పోలీసులకు పట్టుబడి జైలు జీవితం అనుభవించిన మోనికాబేడీ, బిగ్ బాస్ రియాల్టీ షోద్వారా పాప్యులారిటీ సంపాదించి బుల్లి తెర నటిగా కొనసాగుతున్నారు. తన మాజీ ప్రియుడికి బుల్లెట్ గాయం కావడంపై తానేమీ స్పందించలేనని, అక్కడ ఏం జరిగినా తన జీవితంలో మార్పు రాదని తెలిపారు. ప్రస్తుతానికి పని చేయడంలోనే తాను ఎక్కువ ఆనందాన్ని పొందుతున్నానని తెలిపింది.

  • Loading...

More Telugu News