: టీమిండియాకు స్వంతగడ్డ పవర్ చూపిస్తాం: గేల్
చాంపియన్స్ ట్రోఫీలో పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంటామని మెరుపువీరుడు క్రిస్ గేల్ అన్నాడు. జమైకాలో నేడు మీడియాతో మాట్లాడుతూ.. ముక్కోణపు టోర్నీలో స్వంతగడ్డ పవరేంటో చూపిస్తామని హెచ్చరించాడు. ఇటీవలే ఇంగ్లండ్ లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో విండీస్ జట్టు సెమీస్ కు క్వాలిఫై కావడంలో విఫలమైన నేపథ్యంలో.. ట్రయాంగులర్ టోర్నీకి తాము సరికొత్తగా సిద్ధమయ్యామని గేల్ చెప్పుకొచ్చాడు. ఆదివారం నాటి మ్యాచ్ లో చాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్ తో పోరుకు తాము తహతహలాడుతున్నామని అన్నాడు. స్వంత మైదానాల్లో భారత్, లంక జట్లను ముప్పుతిప్పలు పెడతామని, టోర్నీపై తమదైన ముద్ర వేసేందుకు సర్వశక్తులూ ఒడ్డుతామని పేర్కొన్నాడు.