: ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
కొద్దిరోజుల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్ రెడ్డి తెలిపారు. ఆయన నేడు హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల విషయమై రేపు ఉదయం అన్ని పార్టీలతోనూ సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాగా, ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం నుంచి వివరాలు ఇంకా అందలేదని, ఆ వివరాలు అందిన తర్వాత నోటిఫికేషన్ విడుదల చేస్తామని రమాకాంత్ రెడ్డి అన్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు రూ. 160 కోట్లు ఖర్చవుతుందని తాము ప్రతిపాదనలు పంపామని, సర్కారు రూ.104 కోట్లు మంజూరు చేసిందని ఆయన వెల్లడించారు.