: ఆస్తి కోసం తల్లిని బెదిరించిన క్రికెటర్


మన్ ప్రీత్ గోనీ.. ఐపీఎల్ తో బాగా ప్రజాదరణ పొందిన క్రికెటర్. పంజాబ్ కు చెందిన గోనీ కొన్ని సీజన్లపాటు చెన్నై సూపర్ కింగ్స్, డెక్కన్ చార్జర్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. తాజాగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ఆడుతున్న గోనీపై అతడి తల్లి మోహిందర్ కౌర్ (70) తీవ్ర ఆరోపణలు చేసింది. ఆస్తి కోసం చంపుతానని బెదిరిస్తున్నాడని పేర్కొంది. ఈమేరకు మొహాలీ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. మరో తనయుడు మన్మోహన్, అతని భార్య అమన్ దీప్, తన భర్త శర్వాన్ సింగ్ కూడా గోనీకే వంతపాడుతున్నారని ఆమె వాపోయింది. ఇంతకుక్రితం కూడా పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆమె తెలిపింది.

ఈ విషయమై గోనీ స్పందిస్తూ.. తాను కుటుంబం నుంచి విడివడి ఆరేళ్ళయిందని, వారితో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. తల్లితో తనకెలాంటి వివాదాల్లేవని అన్నాడు. అయితే, కొన్నాళ్ళుగా వారి కుటుంబంలో స్థిరాస్తి వ్యవహారంలో చిచ్చు రగులుతోందని స్థానికులు అంటున్నారు.

  • Loading...

More Telugu News