: కోట్లు కురిపించిన కెనడీ కోటు!
తమ జీవిత కాలంలో కొంత మంది వ్యక్తులు సంపాదించుకున్న ఆదరణ, వారి మరణానంతరం కూడా కొనసాగుతుంది. అందుకు నిదర్శనమే జాన్ ఎఫ్ కెనడీ! అమెరికా అధ్యక్షులలో ఆయనకు ఓ ప్రత్యేకత వుంది. ఆయన మరణించి 50 ఏళ్ళు అవుతున్నా, ఆయనకున్న ప్రజాదరణ మాత్రం ఇంకా తగ్గలేదనడానికి నిదర్శనంగా తాజా సంఘటన ఒకటి జరిగింది.
అధ్యక్షుడిగా పని చేస్తున్న రోజుల్లో కెనడీ ఉపయోగించిన బులెట్ ప్రూఫ్ కోటు ఇప్పుడు 3 కోట్ల 15 లక్షలకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. 1963లో కెనడీ దారుణ హత్యకు గురయ్యాడు. ఆ సమయంలో ఆయన వెంట వున్న ఆయన అంతరంగికుడు డేవిడ్ పవర్స్, కెనడీ వస్తువులను జాగ్రత్తగా దాచి ఉంచాడు. వీటిని తాజాగా వేలానికి పెట్టగా, ఆయన ధరించిన కోటు ఇంతటి రేటు పలికింది. ఈ వార్త విని కెనడీ అభిమానులు ఆనందాశ్చర్యాలలో మునిగిపోయారు.