: ఇక పాఠ్యాంశంగా ఎన్.సి.సి
నేషనల్ కేడెట్ కార్ప్స్ (ఎన్.సి.సి) ఇప్పుడు పాఠ్యాంశమయింది. దేశంలో ఎంపిక చేసిన 30 డిగ్రీ కళాశాలల్లో ఎన్.సి.సి ని పాఠ్యాంశంగా ప్రశేశపెట్టామని ఎయిర్ కమాండర్, ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సురేష్ బడియాల్ ప్రకటించారు. ఫైలెట్ ప్రాజెక్టుగా కాకతీయ విశ్వవిద్యాలయంలో రెండో విడతలో ఈ కోర్సును ప్రవేశపెడతామని చెప్పారు. రక్షణ మంత్రిత్వశాఖ కేయూ ఉపకులపతికి ప్రకటించిన ఎన్.సి.సి కల్నల్ ర్యాంకును ఆయనకు సురేష్ అందజేశారు. కేడెట్లకు రిఫ్రెష్ మెంట్ చార్జీలను 6 రూపాయల నుంచి 15 రూపాయలకు పెంచాలని కోరుతూ ప్రతిపాదనలు పంపామని ఆయన చెప్పారు.