: రండి.. మాట్లాడుకుందాం: చైనా
సరిహద్దు సమస్యపై చర్చలకు భారత్ ను చైనా ఆహ్వానించింది. ఇటీవలే చైనా ప్రత్యేక ప్రతినిధిగా ఎంపికైన యాంగ్ జైచీ ఈ విషయం తెలిపారు. 'చైనా - భారత్ సమస్యను పరిష్కరించేందుకు చర్చలు నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏళ్లుగా ఉన్న ఈ సమస్యను ఈ కొత్త తరంలో పరిష్కరిద్దాం' అని యాంగ్ జైచి చెప్పారు.