: కూతుర్ని చంపిన తండ్రి ... మహారాష్ట్రలో పరువు హత్య!


ఉత్తరాదిలో పరువు హత్యలు ఆగడం లేదు. కులాంతర వివాహాల పట్ల ఉత్తరాదిలోని కొన్ని వర్గాలు తీవ్రవ్యతిరేకత చూపిస్తున్నాయి. గత వారం ఉత్తరప్రదేశ్ లో కులాంతర వివాహం చేసుకుంటానన్న కుమార్తెకు వత్తాసు పలికినందుకు తల్లి, కూతుర్ని సజీవ దహనం చేసిన విషయం తెలిసిందే. తాజాగా మహారాష్ట్ర నాసిక్ లోని హనుమాన్ వాడీ ప్రాంతానికి చెందిన ఏక్ నాధ్ కిషన్ కుంభార్కర్(38) అనే వ్యక్తి, కులాంతర వివాహం చేసుకుందని తన 18 ఏళ్ల కుమార్తెను, గర్భిణీ అని కూడా చూడకుండా హత్య చేశాడు. దీంతో పరువు హత్యలపై మరోసారి ఉత్తరాదిలో చర్చకు తెరలేచింది. ఈ రకమైన హత్యలతో గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, బీహార్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాలు చెడ్డపేరు తెచ్చుకున్నాయి.

  • Loading...

More Telugu News