: తెలంగాణకు ప్యాకేజీ లేదు: డీఎస్
తెలంగాణకు ప్యాకేజీ ఉండదని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అంటున్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం వచ్చిందన్నారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయం శాశ్వత పరిష్కారం దిశగా ఉంటుందని చెప్పారు. అధిష్ఠానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 30న జరిగే తెలంగాణ కాంగ్రెస్ సభలో పాల్గొంటానన్నారు. తెలంగాణ ఉద్యమానికి చాలా ఏళ్ల చరిత్ర ఉందని చెప్పారు.