: కరీనా పేరు మార్చుకుంది!
బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ తన పేరును మార్చుకున్నట్టుంది. ఇప్పటివరకు సినిమా టైటిల్స్ లో ఆమె పేరు కరీనా కపూర్ అనే ప్రదర్శిస్తుండగా.. గతరాత్రి ముంబయిలో జరిగిన 'సత్యాగ్రహ' చిత్రం ప్రోమో రిలీజ్ కార్యక్రమంలో ఆమె పేరు చివర 'ఖాన్' తగిలించారు. తన వివాహ స్థితిని తెలిపేందుకే కరీనా పేరు మార్చుకుందని సినీ వర్గాలంటున్నాయి. కరీనా గతేడాది హీరో సైఫ్ అలీ ఖాన్ ను వివాహమాడిన సంగతి తెలిసిందే. సో.. ఇక నుంచి ఈ పొడుగుకాళ్ళ సుందరిని కరీనా కపూర్ ఖాన్ అని పిలవాల్సి ఉంటుంది.