: కానిస్టేబుళ్ల శిక్షణ కాలం తగ్గించిన ప్రభుత్వం
రాష్ట్రంలోని కానిస్టేబుళ్ల శిక్షణ కాలాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో సివిల్ స్టైఫండరీ కానిస్టేబుళ్ల శిక్షణ కాలం తొమ్మిది నెలల నుంచి మూడు నెలలకు, ఆర్మ్ డ్ రిజర్వ్ స్టైఫెండరీ పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణా కాలం తొమ్మిది నెలల నుంచి రెండు నెలలకు తగ్గనుంది.