: ర్యాన్ బ్యాక్సీ ఔషధాలు మంచివే: బ్రిటన్ రెగ్యులేటర్
రాన్ బ్యాక్సీ కంపెనీకి బ్రిటన్ ఔషధ నియంత్రణ మండలి ఉపశమనం కల్పించింది. రాన్ బ్యాక్సీ కంపెనీ ఔషధాలు నాసిరకమైనవి అనడానికి ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లుహెచ్ వో) కూడా గత నెలలో ఇలాంటి ప్రకటనే జారీ చేసింది. భారత్ లోని రెండు తయారీ ప్లాంట్లలో నాసిరకమైన ఔషధాలను తయారు చేసిందనే ఆరోపణలతో రాన్ బ్యాక్సీ పై ఇటీవల అమెరికాలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగా రాన్ బ్యాక్సీ మందులపై సందేహాలు నెలకొన్నాయి.