: ఏడోతరగతి బాలికపై అత్యాచారం.. హత్య
మదమెక్కిన యువకుడు బాలికను బలితీసుకున్నాడు. ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని పొలం నుంచి ఇంటికి వెళుతుండగా కాపు కాసి దారుణంగా అత్యాచారం చేశాడు. ఈ లైంగిక దాడితో బాలిక కన్నుమూసింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా, పాలసముద్రం మండలం బీవీఎస్ఆర్ పురంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.