: తెలుగు వారికి అండగా ఉంటా: జయలలిత


తమిళనాడులోని తెలుగు సమాజానికి ముఖ్యమంత్రి జయలలిత వరాల జల్లు కురిపించారు. తెలుగు వారు కోరిన చోట ఆంధ్రాభవన్ తోపాటు తెలుగు అకాడమీకి స్థలం కేటాయిస్తానంటూ ఆమె హామీ ఇచ్చారు. గవర్నర్ రోశయ్య ప్రత్యేక చొరవ తీసుకోవడంతో తన కార్యాలయంలో తెలుగు ప్రతినిధులతో భేటీ అయిన జయలలిత తెలుగులోనే హామీ ఇచ్చారు. 15 నిమిషాలు సాగిన సమావేశంలో తెలుగు సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను పురచ్చితలైవి దృష్టికి ప్రతినిధులు తెచ్చారు. దీంతో తెలుగు వారు కోరిన చోట స్థలాన్ని కేటాయిస్తామని, తెలుగు విద్యార్ధులు తమిళంతో పాటు తెలుగు కూడా నేర్చుకోవచ్చని తెలిపారు.

  • Loading...

More Telugu News