: నిరుద్యోగులకు శుభవార్త
నిరుద్యోగులకు విద్యాశాఖా మంత్రి శుభవార్త వినిపించారు. రాష్ట్రంలో 20 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వచ్చేనెలలో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు రాష్ట్రమాధ్యమిక విద్యాశాఖా మంత్రి పార్థసారధి తెలిపారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా హార్సెలీ హిల్స్ లో మాట్లాడిన మంత్రి డిఎస్సీ, టెట్ లను వేరువేరుగా నిర్వహించనున్నట్టు తెలిపారు. రెండూ కలిపి నిర్వహించడం వల్ల తలెత్తే సాంకేతిక పరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్థసారధి స్పష్టం చేశారు.