: తిరుపతికి డబుల్ డెక్కర్ రైలు


హైదరాబాద్ నుంచి తిరుపతికి డబుల్ డెక్కర్ రైలు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు విపణి కేంద్రంలో గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో లబ్దిదారులకు అవగాహనా సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు భక్తులు తరలి వస్తుంటారని, దీంతో సాధారణంగా తిరుపతి వెళ్లే ప్రతి రైలు రద్దీగా దర్శనమిస్తుందని. ఈ రద్దీని తగ్గించేందుకు హైదరాబాద్ నుంచి తిరుపతికి డబుల్ డెక్కర్ రైలు నడపనున్నామని కేంద్ర మంత్రి తెలిపారు.

  • Loading...

More Telugu News