: సహాయ కార్యక్రమాలకు చంద్రబాబే అడ్డు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి


ఉత్తరాఖండ్ వరదబాధితుల సహాయ కార్యక్రమాలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే ప్రధాన అడ్డంకిగా మారాడని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. బదరీనాథ్ లో 350 మందికి పైగా తెలుగువారు ఇంకా ఉన్నట్టు గుర్తించామని, అయితే వాతావరణం పూర్తిగా అనుకూలించకపోవడంతో, వారిని మరో రెండు మూడు రోజుల్లో సురక్షితంగా స్వస్థలాలకు చేరుస్తామని హామీ ఇచ్చారు. వారికి వైద్యసదుపాయాలు అందించేందుకు వైద్యబృందాన్ని పంపించామని తెలిపారు. బాధితులను స్వస్థలాలకు చేర్చేందుకు ప్రభుత్వం విమానం ఏర్పాటు చేస్తే, అందులో వారిని ఎక్కనీయకుండా చంద్రబాబు వారిని రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నాడని మండి పడ్డారు. ప్రభుత్వ సహాయక చర్యలకు బాబే ప్రధాన అడ్డంకిగా మారాడని ఉత్తమ్ కుమార్ రెడ్డి దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News