: శృతికి అతి కీలకమైన తేది
కమల్ హాసన్ తనయ శృతిహాసన్ కు అతి కీలకమైన రోజు వచ్చే నెల 19. ఎందుకంటే, బాలీవుడ్లో శృతి భవిష్యత్తును నిర్ణయించే రెండు సినిమాలు 'రామయ్యా వస్తావయ్యా', 'డి-డే' అదే రోజు విడుదలవుతున్నాయి. బాలీవుడ్లో నిలదొక్కుకోవాలని శృతిహాసన్ ముందుగా 'లక్' సినిమాతో అక్కడే తెరంగేట్రం చేసింది. అయితే ఆ సినిమా పరాజయం పాలైంది. తరువాత వచ్చిన 'దిల్ తో బచ్చా హై జీ' సినిమా కూడా సరైన ఫలితాన్నివ్వలేదు. దీంతో రెండేళ్లుగా బాలీవుడ్ కు దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో జూలై 19వ తేదీ శృతి సినిమా కెరీర్ కు చాలా కీలకమనే చెప్పవచ్చు.