: ఈ 15 నెలలు ఖాళీగా లేను: విద్యాబాలన్


బిగ్ స్క్రీన్ కు 15 నెలలు దూరంగా ఉన్నానని తాను భావించడం లేదని నటి విద్యా బాలన్ అన్నారు. విద్య నటించిన సినిమా 'కహానీ' గతేడాది మార్చిలో విడుదల అయింది. మళ్లీ ఆ తర్వాత మరో సినిమా రాలేదు. ఈ మధ్యలో పెళ్లి ముచ్చట తీర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే, త్వరలో 'గన్ చక్కర్' సినిమా ద్వారా మళ్లీ తెరపై కనిపించనుంది. ''కహానీ తర్వాత బిగ్ స్క్రీన్ కు చాలా కాలం పాటు దూరంగా ఉన్నానని అనుకోవడం లేదు. ఇది బ్రేక్ కాదు. ఈ మధ్యలో ఎన్నో చేశాను. కహానీ తర్వాత గన్ చక్కర్ లో యాక్ట్ చేస్తున్నా. పెళ్లి చేసుకున్నా. నెల విరామం తీసుకున్నానంతే. మళ్లీ 'షాదీకే సైడ్ ఎఫెక్ట్స్' చిత్రంలో నటించడం మొదలు పెట్టాను. మళ్లీ కేన్స్ ఫెస్టివల్లో పాల్గొన్నా. గత 15నెలల్లో ఇన్ని చేశా'' అంటూ విద్య చిన్న స్టోరీ చెప్పింది.

  • Loading...

More Telugu News