: 48 గంటల సమ్మెకు పిలుపునిచ్చిన ఆటో డ్రైవర్లు
నలభై ఎనిమిది గంటల సమ్మెకు జంట నగరాల ఆటో డ్రైవర్లు పిలుపునిచ్చారు. డిమాండ్ల సాధనకోసం చేస్తున్నఈ బంద్ ను హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు పరిమితం చేస్తూ, మంగళవారం అర్ధరాత్రి నుంచి చేపడుతున్నట్లు ఆటో యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ (ఆటో జాక్) ప్రకటించింది.
పెరిగిన నిత్యావసర ధరలు, పెట్రో, డీజిల్ ధరలకు అనుగుణంగా ఆటో ఛార్జీలను పెంచాలని ఆటో యూనియన్ డిమాండు చేసింది. అలాగే, దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న డిమాండ్లను పరిష్కరించడంలో సర్కారు విఫలమైందని ఆటో డ్రైవర్లు ఆరోపించారు. .