: వింబుల్డన్లో సంచలనం
ఏడుసార్లు వింబుల్డన్ టైటిల్ గెలుచుకున్న రోజర్ ఫెదరర్, 2004 చాంపియన్ మారియ షరపోవాతోపాటు మరో టాప్ ఆటగాడు లీటన్ హెవిట్ వింబుల్డన్ రెండోరౌండ్లో ఇంటిదారి పట్టారు. తొలి రౌండ్లో రఫెల్ నాదల్ ఓటమిని టెన్నిస్ అభిమానులు మరచిపోకముందే ఈ సంచలనం నమోదయింది. 116 ర్యాంకు ఆటగాడు సెర్జి స్టకోవస్కి 6-7(5/7), 7-6(7/5), 7-5, 7-6(7/5) స్కోరుతో వింబుల్డన్ లెజెండ్ గా పేరు తెచ్చుకున్న ఫెదరర్ ను మట్టి కరిపించాడు. ఫెదరర్ కెరీర్లో ఈ దశాబ్ధంలోనే ఇది అత్యంత చెత్త ప్రదర్శన. అలాగే మహిళల పోరులో పోర్చుగస్ క్వాలిఫయర్ మిచెల్లి లార్చర్ డి బ్రిటో 6-3, 6-4తో మూడో సీడ్ మారియా షరపోవాను చిత్తుచేసింది. మరో పోరులో జర్మన్ క్వాలిఫయర్ డస్టిన్ బ్రౌన్ 6-4, 6-4, 6-7(3/7), 6-2 స్కోరుతో లీటన్ హెవిట్ ను ఓడించాడు.