: పిజ్జా డెలివరీబోయ్ అత్యాచారయత్నం
వయసు 17ఏళ్లు. ఉద్యోగం పిజ్జా డెలివరీ బోయ్. కానీ, పిజ్జా డెలివరీకొచ్చి పాడుపనికి ప్రయత్నించాడు. మహారాష్ట్రలోని వార్ధాకు చెందిన 24 ఏళ్ల యవతి ఉద్యోగం కోసం ముంబైకు చేరుకుంది. అన్నీబీసెంట్ రోడ్డులో ఉంటున్న తన ఆంటీ ఇంట్లో విడిది చేసింది. బుధవారం రాత్రి ఇంట్లో ఆంటీ లేని సమయంలో ఆకలయ్యేసరికి పిజ్జా కోసం ఆర్డర్ చేసింది. దాన్ని తీసుకొని వచ్చిన 17 ఏళ్ల బాలుడు అది ఆమెకిచ్చి వెళ్లిపోయాడు. ఇంట్లో ఒంటరిగా ఉందన్న ఆలోచనతో మళ్లీ వెనక్కి వచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు. సాస్ ప్యాకెట్లు ఇవ్వడం మర్చిపోయానని చెప్పి ఒక్కసారిగా ఆమెను సోఫామీదకు తోసేసి, డోర్ లాక్ చేశాడు. అనంతరం అత్యాచారం చేయబోగా.. ఆమె పెనుగులాడింది. కిచెన్ లోకి గుంజుకెళ్లాడు. అతడి ప్రయత్నానికి ఆమె అడ్డుపడడంతో అక్కడే కనిపించిన చాకుతో మెడపై గాయపరిచాడు. ఆమె కేకలు పెట్టడంతో భయంతో ఆ బాలుడు పరుగులు తీశాడు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.