: బతికినా క్యాన్సర్ ముప్పు తప్పదు
గుండె వైఫల్యం చెందడం వల్ల మరణించడం జరుగుతుంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో గుండె వైఫల్యం చెందినా కూడా సరైన వైద్య సదుపాయాలు లభించడం వల్ల రోగులు త్వరగా కోలుకుని తిరిగి బతకడం జరుగుతుంటుంది. అయితే ఇలా బతికినా కూడా అలాంటి వారికి క్యాన్సర్ ముప్పు తప్పదంటున్నారు వైద్యులు.
గుండె వైఫల్యం చెందినా కూడా తగు వైద్యం లభించడం వల్ల రోగులు తిరిగి బతికి బయటపడుతుంటారు. అయితే అలాంటి వారిలో క్యాన్సర్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయని, వారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గుండె వైఫల్యానికి చెందిన చికిత్స వల్ల వారిలో చోటుచేసుకునే ప్రతికూలతలు, ఒత్తిడి, ఇంకా ఇతర అంశాల కారణంగా వారికి మరో వ్యాధి వచ్చే ముప్పు పొంచి ఉంటుందని శాస్త్రవేత్తలు వివరించారు.