: అక్కడ భూమిలాంటి గ్రహాలు ఉంటాయేమో!
అంతరిక్షంలో మన భూమిలాంటి గ్రహాలు ఉంటాయా...? ఏమో ఉండే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే మన సౌరకుటుంబంలాంటి మరో సౌరకుటుంబాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ కుటుంబంలో భూమిలా ఒక నక్షత్రం చుట్టూ తిరిగే గ్రహాలను మూడింటిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
జర్మనీకి చెందిన గొట్టింజెన్, బ్రిటన్‌లోని హెర్డ్‌ఫోర్డ్ షైర్ యూనివర్సిటీలు సంయుక్తంగా జరిపిన ఒక పరిశోధనలో శాస్త్రవేత్తలు స్కార్పియాన్ అనే నక్షత్ర మండలాన్ని కనుగొన్నారు. ఈ నక్షత్ర మండలంలో నక్షత్రం చుట్టూ మనభూమిలా తిరుగుతున్న గ్రహాలను మూడింటిని కనుగొన్నారు. ఇవి మనుషులకు నివాసయోగ్యంగా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ నక్షత్ర మండలం మనకు 22 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.