: చంద్ర బాబూ.. పోలింగ్ కేంద్రానికి దగ్గర్లో ఉండకండి: టీడీపీ అధినేతకు ఈసీ సూచన
ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబుకు ఎన్నికల సంఘం షరతులు విధించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్ కోడ్ అమల్లో ఉన్నందున, ఈ నెల 19 నుంచి 21 వరకు వేమూరు వద్ద ఉండిపోవాలని సూచించింది. పాదయాత్రతో పాటు ఎలాంటి ఎన్నికల ప్రచారమూ చేయరాదని ఎన్నికల సంఘం పేర్కొంది. పోలింగ్ కేంద్రానికి దగ్గర్లో ఉండొద్దని బాబుకు తెలిపింది.