: షర్మిల చెబుతున్న 'బ్రాందేయవాదం'
వైఎస్సార్ కాంగ్రెస్ నేత షర్మిల కాంగ్రెస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి కిరణ్ పాలనలో రాష్ట్ర కాంగ్రెస్ గాంధేయవాదాన్ని వదిలి బ్రాందేయవాదాన్ని నెత్తికెత్తుకుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కిరణ్ రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ లా మార్చారని షర్మిల ఆరోపించారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో నేడు నిర్వహించిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సందర్భంగా ఆమె ప్రసంగించారు. అసలు.. బెల్టు షాపులకు శ్రీకారం చుట్టింది బాబే అని షర్మిల ఆరోపించారు. ఇక తాజా ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పట్టించుకోకుండా, ఊరూరా మినీ బార్లు తెరుస్తూ.. మద్యం ప్రవాహానికి గేట్లెత్తిందని విమర్శించారు.