: యాత్రీకుల తరలింపుకు 85 లక్షలు ఖర్చు చేశాం: ఎన్టీఆర్ ట్రస్టు


ఉత్తరాఖండ్ నుంచి తెలుగు యాత్రీకులను సురక్షితంగా స్వస్థలాలకు తరలించేందుకు ఎన్టీఆర్ ట్రస్టు తరపున ఇప్పటి వరకు 85 లక్షల రూపాయలు ఖర్చు చేశామని ట్రస్టు సీఈవో మొటపర్తి వెంకట్ తెలిపారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో మాట్లాడుతూ, బాధితులను ఆదుకునేందుకు అనేకమంది స్పందిస్తూ విరాళాలు ఇస్తున్నారన్న ఆయన, ఎన్టీఆర్ ట్రస్టు సిబ్బంది ఒక్క రోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చినట్టు తెలిపారు. బాధితులను ఆదుకునేందుకు అనేకమంది ఎన్ఆర్ఐ లు ముందుకు వస్తుండగా, జగిత్యాల ఎమ్మెల్యే ఎల్ రమణ 50 వేలరూపాయలు విరాళమిచ్చారని తెలిపారు.

  • Loading...

More Telugu News