: చండీలాకు మళ్ళీ చుక్కెదురు


ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయిన రాజస్థాన్ రాయల్స్ మాజీ ఆటగాడు అజిత్ చండీలాకు మరోసారి చుక్కెదురైంది. చండీలా పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణను కోర్టు జులై 1కి వాయిదా వేసింది. చండీలాతో పాటు మరో ఇద్దరు బుకీల బెయిల్ పిటిషన్లపైనా విచారణను ఢిల్లీ కోర్టు వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. కాగా, చండీలాతోపాటు అరెస్టయిన మరో ఇద్దరు క్రికెటర్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్లకు బెయిల్ లభించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News