: రికార్డుల కోసం పాదయాత్ర కాదు: వైఎస్ షర్మిల
రికార్డుల కోసం, పండగలు జరుపుకోవడం కోసం పాదయాత్రలు కాదని నల్గొండ జిల్లా 70వ రోజు పాదయాత్రలో ఉన్న కడప ఎంపీ వైఎస్ జగన్ సోదరి షర్మిల అన్నారు. తన తండ్రి వైఎస్ ఆశీస్సులు, దేవుని దయతో చేస్తోన్న తన పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు చేరుకుందని ఆమె తెలిపారు. యాత్ర చేసిన జిల్లాల్లోని అన్ని గ్రామాల్లో ప్రజలు కన్నీళ్లు, కష్టాలే వెలిబుచ్చారని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే వైఎస్ఆర్ ఆనాడు పాదయాత్రను మహాయజ్ఞంలా చేశారని అన్నారు.