: వీహెచ్ అత్యుత్సాహం ప్రదర్శించారు: టీడీపీ నేత జనార్ధన్
కాంగ్రెస్ ఎంపీ వీహెచ్ డెహ్రాడూన్ లో అత్యుత్సాహం ప్రదర్శించారని టీడీపీ నేత టీడీ జనార్ధన్ విమర్శించారు. హైదరాబాద్ లో మాట్లాడిన జనార్ధన్, వీహెచ్ ఇప్పుడు ప్రదర్శించిన అత్యుత్సాహం ప్రధాని, సోనియా, కిరణ్ లవద్ద ప్రదర్శించి ఉంటే బాధితులకు సత్వరన్యాయం జరిగి ఉండేదని అభిప్రాయపడ్డారు. టీడీపీని ఆడిపోసుకోవడం తప్పితే తమ బాధ్యతను కాంగ్రెస్ ఏనాడూ నిర్వర్తించలేదని జనార్ధన్ ఆరోపించారు.